ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఈ నెల 27న మంగళగిరిలో జగన్‌ పర్యటన

ముఖ్యమంత్రి జగన్ ఏప్రిల్ 27 న విజయవాడ, మంగళగిరి లో పర్యటించబోతున్నారు. 27 సాయంత్రం 5.10 నిమిషాలకు విజయవాడ 1 టౌన్‌ వించి పేటలో షాజహుర్‌ ముసాఫిర్‌ ఖానా, ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఆ తర్వాత ముస్లిం మత పెద్దలతో భేటీ కానున్నారు.

రంజాన్ మాసం సందర్భంగా విజయవాడ ఇంధిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అదే రోజు రాత్రి 7.35 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌ కు చేరుకొని.. గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా కుమారుడి వివాహ వేడుకకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.