జాతీయం తెలంగాణ ముఖ్యాంశాలు

ఆ మెసేజ్ చేసి కేసీఆర్ ను ప్రధాని అవమానించారు – కేటీఆర్

గత కొద్దీ రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి ..కేంద్రానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఎవరు కూడా ఎక్కడ తగ్గకుండా మాటల యుద్ధం చేస్తున్నారు. బిజెపి కి సరైన బుద్ది చెప్పాలని సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అలాగే మంత్రి కేటీఆర్ సైతం మీడియా లలో , ట్విట్టర్ లలో బిజెపి ఫై ఎప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కేంద్ర తప్పులను బయటపెడుతున్నారు. కాగా ఈ మధ్య తెలంగాణ ప్రధాని కార్యక్రమాలకు కేసీఆర్ గైర్హాజరు కావడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై ఇంత వరకు ఎవరూ స్పందించ లేదు. ఎవరికి వారు ఊహించుకోవడం తప్ప… ఈ అంశానికి సంబంధించి క్లారిటీ లేదు. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ కేసీఆర్ గైర్హాజరు కావడానికి అసలు కారణం తెలిపారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ… ప్రధాని మోదీ హైదరాబాదుకు వచ్చిన రెండు సార్లూ పీఎంవో (ప్రధాని కార్యలయం) నుంచి స్పష్టమైన మెసేజ్ వచ్చిందని… ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదనేది ఆ మెసేజ్ సారాంశమని చెప్పారు. ఇది ముమ్మాటికీ ఒక ముఖ్యమంత్రిని ప్రధాని అవమానించడమేనని అన్నారు. ప్రధాని కార్యాలయం ప్రొటోకాల్ ను ఉల్లంఘించిందని విమర్శించారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదనే ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ… గవర్నర్ బీజేపీ నాయకురాలి మాదిరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆమె చదివిన రిపబ్లిక్ డే స్పీచ్ కూడా మంత్రివర్గం ఆమోదించినది కాదని చెప్పారు. ఆమె రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.