మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313
మృతుల సంఖ్య మొత్తం 3,81,903
దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 67,208 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం… నిన్న 1,03,570 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,00,313కు చేరింది. మరో 2,330 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,81,903కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,84,91,670 మంది కోలుకున్నారు. 8,26,740 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 26,55,19,251 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 38,52,38,220 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,31,249 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.