ఈరోజు ప్రధాని మోడీ ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కలువనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టిని తర్వాత స్టాలిన్ దేశ రాజధానికి వెళ్లడం ఇదే మొదటిసారి. ప్రధానితో భేటీ సందర్భంగా నీట్ రద్దు, వ్యాక్సిన్ల పంపిణీ సహా పలు అంశాలపై చర్చించనున్నారు. వీటితోపాటు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరనున్నారు.
కరోనా నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేయాలని ఇప్పటికే సీఎం స్టాలిన్ ప్రధానికి లేఖ రాశారు. విద్యార్థుల శ్రేయస్సే తమకు ప్రధానమని అందులో పేర్కొన్నారు. అదేవిధంగా తమిళనాడులో ఇంటిగ్రేటెడ్ వ్యాక్సిన్ కాంప్లెక్స్ (ఐవీసీ)ని వినియోగంలోకి తీసుకురావాలని కోరనున్నారు. కేసులు అధికంగా ఉండటంతో రాష్ట్రానికి ఇచ్చే వ్యాక్సిన్ కోటాను పెంచాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు.