ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలోని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పై సొంత పార్టీ కార్య కర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తలారి వెంకట్రావు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే పై దాడి చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జి.కొత్తపల్లిలో ఉదయం వైస్సార్సీపీ నాయకుడు గంజి ప్రసాద్ హత్యహత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే వెంకట్రావు ను పార్టీలోని మరో వర్గం అడ్డుకొని, ఆయనపై దాడి చేసారు. కార్యకర్తల దాడి నుండి కాపాడుకునేందుకు ఆయన పరుగులు పెట్టారు. ప్రస్తుతం పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు.