పొరుగు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అధ్వాన్నమన్న కేటీఆర్
ఆంధ్రా- తమిళనాడు సరిహధ్దును పరిశీలించి ఆధారాలు చూపిన వైనం
ఏపీలో మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా నగరి మండలంలోని తన స్వగ్రామం అయనంబాకం గ్రామానికి వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని కూడా నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో రోడ్లు గుంతలమయంగా ఉంటే… పొరుగు రాష్ట్రాల్లో మాత్రం రోడ్లు చక్కగా ఉన్నాయని నారాయణ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని నారాయణ ఆధారాలను చూపిస్తూ మరీ చెప్పడం గమనార్హం.
కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రా- తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని నారాయణ సందర్శించారు. ఏపీ రోడ్లతో తమిళనాడు రోడ్లను ఆయన పోల్చి చూశారు. ఏపీ రోడ్లను తమిళనాడు రోడ్లతో పోల్చి చూస్తే…. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన అన్నారు.