జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదు

దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది కోలుకున్నారు. మరో 19,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,23,869 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 26 మంది మరణించగా, 2723 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీలోనే అత్యధికంగా ఉన్నాయి. దేశ రాజధానిలో 1485 కేసులు రికార్డయ్యాయి.

కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్‌గా ఉన్నది 0.05 శాతం మాత్రమేనని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.74 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని పేర్కొన్నది. ఇక ఇప్పటివరకు 1,89,23,98,347 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో ఆదివారం 4,02,170 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని వెల్లడించింది.