కరోనా మహమ్మారి పీడ ఇంకా విరగడ కాలేదు. తగ్గిపోయింది..అని ఊపిరి పీల్చుకునే లోపే.. మళ్లీ విజృభిస్తుంది. ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఎన్నో వేరియెంట్‌లు వెలుగుచూడగా.. తాజాగా రష్యాలోని మాస్కో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వెలుగుచూసింది. ఇది మాస్కోలో బయటపడడంతో దీనిని మాస్కో వేరియంట్‌గా పిలుస్తున్నారు. ఈ మేరకు రష్యాలోని గమలేయా నేషనల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు.
దేశంలో కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా ఈ రకం బయటపడింది. ఆ దేశం అభివృద్ధి చేసిన స్పుత్నిక్ టీకా ‘మాస్కో వేరియంట్’పై ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందన్న దానిపై పరిశోధనలు నిర్వహిస్తున్నట్టు ‘గమలేయ’ హెడ్ అలెంగ్జాండర్ గింట్స్‌బర్గ్ తెలిపారు. ఈ కొత్త స్ట్రెయిన్‌పై వ్యాక్సిన్ పనిచేస్తుందనే విశ్వసిస్తున్నట్టు చెప్పారు. కాగా, రష్యాలో నిన్న 13,397 కేసులు వెలుగుచూడగా అందులో ఒక్క మాస్కోలోనే 5,782 కేసులు నమోదు కావడం గమనార్హం.