అంతర్జాతీయం ముఖ్యాంశాలు

వ‌ర్క్ ప‌ర్మిట్ వీసా గ‌డువు పొడిగించిన అమెరికా

వేలాది మంది భార‌తీయుల‌కు అమెరికా ప్రభుత్వం ఊర‌ట క‌ల్పించింది. వ‌ర్క్ ప‌ర్మిట్ వీసా గ‌డువు ముగుస్తున్న కొన్ని క్యాట‌గిరీల వాళ్ల‌కు ఆటోమెటిక్‌గా పొడిగింపు క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంట్లో గ్రీన్‌కార్డు హోల్డ‌ర్ల‌తో పాటు హెచ్-1బీ వీసాదారులు భాగ‌స్వాములు కూడా ఉన్నారు. వీళ్లంద‌రికీ మ‌రో ఏడాదిన్న‌ర కాలం పాటు ఎంప్లాయిమెంట్ ఆథ‌రైజేష‌న్ కార్డుల‌ను జారీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. హోంల్యాండ్ సెక్యూర్టీ శాఖ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. అమెరికా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వేలాది మంది భార‌తీయ వ‌ల‌స‌దారుల‌కు ల‌బ్ధి చేకూర్చ‌నున్న‌ది. 180 రోజుల పొడిగింపును ఆటోమెటిక్‌గా 540 రోజుల‌కు పెంచుతున్న‌ట్లు హోంల్యాండ్ సెక్యూర్టీ శాఖ తెలిపింది.