దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు ఎక్కువై పోతున్నాయి. కోర్టుల శిక్షలకు , పోలీసుల కఠిన చర్య లకు , చట్టాలకు కామాంధులు ఏమాత్రం భయపడడం లేదు. ఒంటరిగా మహిళా కనిపిస్తే చాలు వారి కామ కోరిక తీర్చుకుంటున్నారు. ఆఖరికి అభం శుభం తెలియని బాలికలను సైతం వదలడం లేదు. తాజాగా బిహార్ జముయీలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే…
రోజు మాదిరిగానే 14 ఏళ్ల బాలిక స్కూల్ నుండి ఇంటికొస్తుండగా.. ఐదుగురు యువకులు ఆమెను అడ్డగించి.బలవంతంగా సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్లి ఒక్కొక్కరుగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. స్పృహతప్పిన బాధితురాలిని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఎంతకూ ఇంటికి రాకపోయేసరికి ఆ బాలిక తల్లిదండ్రులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. చివరకు బాధితురాలే ఎలాగోలా ఇంటికి చేరింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి.. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. మిగతావారి కోసం గాలిస్తున్నారు.