దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 29 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 3,410 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
దేశంలో ప్రస్తుతం 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,05,401కు చేరింది. ఇందులో మొత్తం 4,25,60,905 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా ఇప్పటివరకు మొత్తం 5,24,093 మంది మరణించారు. ఇక, దేశంలో కరోనా పాజిటివిటి రేటు 99.20 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 1,90,34,90,396 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.