శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే మహిందా రాజపక్స అధికారిక నివాసంలో కాల్పులు చోటు చేసుకుంది. అయితే రాజపక్స నివాసాన్ని ముట్టడించేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలిరావడంతో, ఆందోళనకారులను అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అధికారిక నివాసం గేటు వద్ద కూడా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజపక్స అధికారిక నివాసం వద్ద వేల సంఖ్యలో
కాగా, అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స పదవుల నుంచి దిగిపోవాలంటూ నెల రోజులుగా నిరసనలు తెలుపుతున్న ప్రజలు సోమవారం ఉద్యమాన్ని మరింత తీవ్రం చేశారు. కొలంబోలో అధ్యక్ష కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. అనంతరం నిరసనకారులు ప్రభుత్వ మద్దతు దారులపై దాడులకు దిగారు. వారి వాహనాలకు నిప్పు పెట్టారు. ఎంపీలు, అధికార పార్టీ నేతల ఇండ్లను ముట్టడించారు. హింస కొలంబో నుంచి దేశమంతటికీ విస్తరించింది. సోమవారం ఘర్షణల్లో అధికార ఎస్‌ఎల్‌పీపీ పార్టీ ఎంపీ అమరకీర్తి సహా ముగ్గురు చనిపోయారు. 154 మందికి గాయాలయ్యాయి.