ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ప్రారంభమైన ఏపీ రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం

అస‌ని తుఫానుపై కీల‌క చ‌ర్చ‌
కొత్త, పాత మంత్రుల‌తో జ‌గ‌న్ భేటీ

సీఎం జగన్ అధ్య‌క్ష‌త‌న ఆ రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం కాసేప‌టి క్రితం ప్రారంభ‌మైంది. మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగిన త‌ర్వాత ఏపీ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌డం ఇదే తొలి సారి కావ‌డంతో ప్రాధాన్యం సంత‌రించుకుంది. మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో కొత్త‌గా మంత్రులుగా ప‌ద‌వులు చేప‌ట్టిన వారితో పాటు ప‌ద‌వులు కాపాడుకున్న మంత్రుల‌తో జ‌గ‌న్ భేటీ అయ్యారు.