సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేడు శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్నారు. కుటుంబ సమేతంగా శ్రీశైలం వెళ్తున్నారు. దీంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీజేఐ అటునుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ తొలుత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈ నెల 15న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి సేవలో పాల్గొన్నారు. మూడు రోజుల తర్వాత నేడు ఏపీలోని శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు.