gold-price high
జాతీయం ముఖ్యాంశాలు

64 వేలకు చేరిన బంగారం

గత ఏడాది చివరిలో, అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన గోల్డ్‌ రేటు అదే స్థాయిలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,072 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి రేటులోనూ ఎలాంటి మార్పు లేదు.హైదరాబాద్‌  మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 58,550 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 63,870 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 47,900 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.