ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో పవన్ కీలక ప్రకటన
ఉమ్మడి నల్గొండ జిల్లాలో శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన ప్రజల నుద్దేశించి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ తాము పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలోని మూడో వంతు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ఈ సందర్బంగా నల్గొండ జిల్లాలో పవన్‌కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.