జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 2,022 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,832

దేశంలో గడిచిన 24 గంటల్లో 2,022 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇదే సమయంలో 2,099 మంది కరోనా నుంచి కోలుకోగా… 46 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 14,832 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,38,393కి పెరిగింది. ఇప్పటి వరకు 4,25,99,102 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,24,459కి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.75 శాతంగా, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,92,38,45,615 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 8,81,668 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.