జాతీయం ముఖ్యాంశాలు

మూడో రోజు కూడా నష్టాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303 పాయింట్లు నష్టపోయి 53,749కి పడిపోయింది. నిఫ్టీ 99 పాయింట్లు కోల్పోయి 16,025కి దిగజారింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.52వద్ద కొనసాగుతుంది.