ఆంధ్రప్రదేశ్

మహానాడుతో రాష్ట్ర ప్రజలకు శుభ సమయం ప్రారంభం కాబోతోంది : మాగంటి బాబు

ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని వ్యాఖ్య

టీడీపీ కీలక నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు వైస్సార్సీపీ లోకి వెళ్లనని చెప్పారు. వైస్సార్సీపీలోకి వెళ్లిన వాళ్లు కూడా త్వరలోనే టీడీపీలోకి తిరిగి వస్తారని అన్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్… రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చారని అన్నారు. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒనగూరింది ఏమీ లేదని… అక్రమ అరెస్ట్ లు, పోలీసుల దౌర్జన్యాలు, మంత్రుల దుర్భాషలు, ఎమ్మెల్యేల రౌడీయిజమే మిగిలాయని చెప్పారు. మహానాడుతో రాష్ట్ర ప్రజలకు ఒక శుభ సమయం ప్రారంభం కాబోతోందని అన్నారు. ఏలూరు పార్లమెంటు రాజకీయాల్లోనే తాను ఉంటానని చెప్పారు.