ప్రధాని మోడీ గురువారం హైదరాబాద్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన లో భాగంగా బేగం పేట్ లో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో టీఆరఎస్ ప్రభుత్వం ఫై , టీఆరఎస్ పార్టీ ఫై విమర్శలు చేసారు.ఈ విమర్శలకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.
కుటుంబ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ.. గతంలో కుటుంబ పార్టీలతో బీజేపీ అంటకాగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? తమిళనాడులో డీఎంకే, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్‌లో అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకొన్నప్పుడు ఈ చిలుక పలుకులు ఏమయ్యాయి? శివసేనతో, అకాలీదళ్‌తో బీజేపీ అధికారం పంచుకోలేదా? యూపీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొన్న అప్నాదళ్ కుటుంబ పార్టీ కాదా? నాడు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసిండ్రు.. నేడు బీజేపీ తెలంగాణలో చిచ్చు పెట్టి అభివృద్ధిని అడ్డుకొంటున్నది.
ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఓట్ల కోసం మత కలహాలు సృష్టించే పార్టీ బీజేపీ అని హరీష్ రావు విరుచుకపడ్డారు. మోదీ తెలంగాణకు వచ్చి ఏదో ఇస్తాడనుకొంటే.. రాజకీయ బురద చల్లి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పుకోలేక.. పనికిరాని పాత డైలాగులే మళ్లీ చెప్పి వెళ్లిపోయారని చురకలు వేశారు.