జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్త‌గా 2,685 క‌రోనా కేసులు

దేశంలో రోజువారీ కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటలో దేశంలో కొత్తగా 2,685 కరోనా కేసులు నమోదయ్యాయి. క‌రోనాతో 33 మంది మరణించారు. దీంతో మొత్తం కేసులు 4,31,50,215కు చేరగా, 5,24,572 మంది బాధితులు వైరస్‌కు బలయ్యారు. ఇప్పటివరకు 4,26,09,335 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 16,308 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 2158 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.60 శాతానికి పెరిగింది, యాక్టివ్‌ కేసులు 0.04 శాతం, రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని తెలిపింది. శుక్రవారం 14,39,466 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని, దీంతో ఇప్పటివరకు 1,93,13,41,918 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్ల‌డించింది.