ఎన్టీఆర్ ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి..ఉపరాష్ట్రపతి వెంకయ్య
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. మావాడు అని తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే మహానటుడు, మహా నాయకుడు నందమూరి తారకరామారావు అని వెంకయ్య నాయుడు కొనియాడారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్ ది విలక్షణమైన వ్యక్తిత్వమని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో, అంత్యోదయ మార్గంలో ఎన్టీఆర్ పరిపాలన సాగిందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిలిచిన ఆయన పాలన ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. ఆ మహానాయకుడి స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకోవాలని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని వెంకయ్య ఆకాంక్షించారు.