తెలంగాణ ముఖ్యాంశాలు

తెలంగాణలో పలువురు జిల్లా జడ్జీల బదిలీ

తెలంగాణ లో పలువురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ అడిషనల్ స్పెషల్ కోర్టు లో పనిచేస్తున్న జి. నీలిమ ను జగిత్యాల జిల్లా రెండవ అడిషనల్ జడ్జిగా, జగిత్యాల జిల్లా రెండో అడిషనల్ సెషన్స్ జడ్జి గా పనిచేస్తున్న ప్రతిమ ను కరీంనగర్ జిల్లా సెషన్స్ జడ్జిగా, కరీంనగర్ లేబర్ కోర్టు జడ్జి గా పనిచేస్తున్న లాల్ సింగ్ శ్రీనివాస్ ను నిజాంబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు, ఏసీబీ కోర్టు జడ్జి గా పనిచేస్తున్న వీరయ్యను నగర్ నాలుగవ అదనపు సెషన్స్ ఫాస్ట్ కోర్ట్ జడ్జ్ గా, కరీంనగర్ ఫాస్ట్ కోర్టు జడ్జి గా పనిచేస్తున్న లక్ష్మి కుమారిని కరీంనగర్ స్పెషల్ ఏసీబీ కోర్టు జడ్జిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.