శ్రీనగర్ లో పని చేస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్లు బదిలీ
కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకుంటూ రక్తపుటేరులు పారిస్తున్నారు. కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని వారు హత్యాకాండను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్ లో పని చేస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను కశ్మీర్ లోయ నుంచి సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు కుల్గామ్ జిల్లాలో టీచర్ హత్యకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో కశ్మీరీ పండిట్లు కూడా పాల్గొన్నారు. ఇటీవలే ఒక కశ్మీరీ పండిట్ మహిళా అధ్యాపకురాలిని ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.