హైదరాబాద్ లో మరో దురాగతం చోటుచేసుకుంది. మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అభివృద్ధి లో దూసుకెళ్తున్న మహానగరంలో ఆడవారికి , ముఖ్యంగా యువతులకు రక్షణ లేకుండా అయిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు నగరంలో ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన వెలుగు చూస్తూనే ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన ఇంకా నడుస్తుండగానే మరో రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పుట్టినరోజు వేడుకలకు రమ్మని స్నేహితురాలు చెప్పినందుకు ..ఏకంగా కార్ లోనే ఆమెను అత్యాచారం చేసిన ఘటన నెక్ల్స్ రోడ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన సురేష్ అనే యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఇప్పుడు మరో సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఖార్ఖానా పోలీసులు తెలిపిన దాని ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే బాలిక పదవ తరగతి చదువుతోంది. అదే తరగతికి చెందిన విద్యార్థితో సోషల్ మీడియా లో పరిచయం ఏర్పడింది. మాయ మాటలతో బాలికను అతడు లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో బాలికతో సన్నిహితంగా ఉన్న సమయంలో కొన్ని వీడియోలు తీశాడు.
వాటిని అడ్డుపెట్టుకొని బాలికను బెదిరిస్తూ అతడు తన స్నేహితులైన మరో నలుగురితో కలిసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా ఇలాగే జరుగుతుంది. గత కొద్దీ రోజులుగా కూతురి ప్రవర్తన అదోలా ఉండడం తో తల్లిదండ్రులు గట్టిగా అడిగారు. దీంతో జరిగిన విషయాన్నీ తెలిపింది. ఇక విషయం తెలుసుకున్న బాలిక తండ్రి గత నెల 30న కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాలకు చెందిన ఇద్దరు మైనర్ బాలురు, ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.