ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

పవన్ కల్యాణ్ కు కేఏ పాల్ బంపర్ ఆఫర్

1,000 కోట్ల ఆఫర్..ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలిపిస్తామని హామీ

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జన సేన అధినేత పవన్ కల్యాణ్ కు బంపర్ ఆఫర్ ఇస్తూ తమ పార్టీలోకి ఆహ్వానం పలికారు. పవన్ తన సొంత పార్టీ జనసేనను వదిలిపెట్టి తమ పార్టీలో చేరితే… ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలిపిస్తామని చెప్పారు.

ఒకవేళ పవన్ ను గెలిపించలేకపోతే రూ. 1,000 కోట్ల నజరానా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో పవన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ సొంతంగా పోటీ చేసినా, మరో పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా ఎన్నికల్లో గెలవలేడని చెప్పారు. బీజేపీతో చేతులు కలిపిన పవన్ కల్యాణ్… బైబిల్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు.