టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం టెన్త్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తుండగా సడెన్ గా వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని , వల్లభనేని వంశీ ప్రత్యేక్షమయ్యారు. దీంతో నిర్వాహకులు కాల్ కట్ చేసారు. విద్యార్థుల ఐడీతో వీరు లాగిన్ అయ్యారని తెలుస్తుంది. సడెన్ గా వైసీపీ నేతలు కన్పించడం తో లోకేష్ ఒక్కింత షాక్ కు గురయ్యారు. వంశీ ఆఫీస్ లోని ల్యాప్టాప్ లో విద్యార్థి ఐడి తో జూమ్ మీటింగ్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది. వంశీ తో పాటు కొడాలి నాని, దేవేందర్ రెడ్డి లు జూమ్ మీటింగ్ లో కనిపించారు. ఇలా మీటింగ్ లో కాదు డైరెక్ట్ గా మీతో మాట్లాడతా అంటూ వారికీ లోకేష్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇటీవల విడుదలైన ఏపీ పదో తరగతి పరీక్షలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎక్కువ మంది ఫరీక్షల్లో ఫెయిల్ అవ్వడం.. కొందరు ఒక్కో మార్కు తేడాతో ఫెయిలై ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే ఇదంతా ప్రభుత్వ అసమర్ధతే అని.. టీడీపీ , జనసేన పార్టీలు ఆరోపిస్తున్నాయి.. ప్రభుత్వం చేతకానికి తనంతోనే.. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పది పరీక్షల్లో అతి తక్కువ శాతం మంది పాసయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ బమీటింగ్ నిర్వహించారు.. వారి సమస్యలను వింటూ.. అన్ని విధలా అండగా ఉంటామని.. ఎవరూ అధైర్య పడి మానసిక ఒత్తిడకి గురి కావొద్దని భరోసా ఇచ్చారు.. ఫెయిలైన.. తక్కువ మార్కులు వచ్చిన వారి తరపున ప్రభుత్వంతో తాను పోరాడుతాను అని హామీ ఇచ్చారు.
అంతకు ముందు టెన్త్ ఫలితాల అనంతరం ట్విట్టర్ లో లోకేష్ స్పందించిన సంగతి తెలిసిందే. టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదు.. సర్కారు ఫెయిల్యూర్ అని ఆయన మండిపడ్డారు. అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకి విద్యార్థుల్ని తగ్గించే కుట్ర అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. టెన్త్ ఎక్కువ మంది పాసైతే అమ్మ ఒడితోపాటు ఇంటర్, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుందని కుట్రతోనే ఎక్కువ మందిని ఫెయిల్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షలు పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీసులతో అభాసుపాలు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. టెన్త్ రిజల్ట్స్ వాయిదా, దిగజారిన ఫలితాలన్నీ సర్కారు కుతంత్రమేనని, నాడు నేడు పేరుతో రూ. 3500 కోట్లు మింగేసి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన దుయ్యబట్టారు. టీచర్లకి తన వైన్‌షాపుల వద్ద డ్యూటీ వేసే శ్రద్ధ విద్యపై సీఎం ఎప్పుడూ దృష్టి పెట్టలేదంటూ లోకేష్ విమర్శించారు.