ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

లోకేష్ జూమ్ వీడియో లోకి ఎందుకు వచ్చారో క్లారిటీ ఇచ్చిన కొడాలి, వంశీ

ఏపీ రాజకీయాలు ఇప్పటికే మరింత వేడిగా ఉండగాఉండగా ..గురువారం లోకేష్ జూమ్ వీడియో లో వైస్సార్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ తో పాటు మరొక నేత దేవేందర్ రెడ్డి వచ్చి షాక్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఒక్కసారిగా కనిపించడం తో నిర్వాహకులు వారి కాల్ ను కట్ చేసారు. వీరి రాకపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..అసలు ఎందుకు వచ్చారనేదానిపై వారు మీడియా తో క్లారిటీ ఇచ్చారు.

రెండేళ్లుగా క్లాసులు జరగలేదని..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్దులకు ట్యాబ్ లు..స్మార్టు ఫోన్లు లేవని..వారికి ఎనిమిది -తొమ్మది తరగతుల పాఠ్యాంశాల పైన పట్టు లేక పదో తరగతిలో ఫెయిల్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధులకు మరింత బాధ పెట్టేలా వాళ్లను మీటింగ్ లో కూర్చొబెట్టి.. ప్రసంగాలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. ఫెయిల్ అయిన విద్యార్దులకు మనోధైర్యం చెప్పాల్సిన సమయంలో..రాజకీయం కోసం వారిని వాడుకోవటం ఏంటని ప్రశ్నించేందుకు తాము జూమ్ మీటింగ్ లోకి వెళ్లామంటూ ఇద్దరు నేతలు చెప్పుకొచ్చారు. పదో తరగతిలో స్టాండర్డ్స్ లేకుండా పాస్ చేస్తే ఆ విద్యార్ధులంతా ఇంటర్ లో ఇబ్బంది పడతారని..వారు పవన్ కళ్యాణ్ – లోకేష్ లా అవుతారరంటూ కొడాలి నాని ఎద్దేవా చేసారు. విద్యార్ధులకు నెల రోజుల్లో తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని..అందులో పాస్ అయితే ఇప్పుడు రెగ్యులర్ గా పాసయిన వారితో పాటుగానే వారికి కంపార్ట్ మెంటల్ గా కాకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తారని వివరించారు. తాము అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానాలు చెప్పలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. లోకేష్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించానని మరో వైఎస్సార్‌సీపీ నేత దేవేందర్ రెడ్డి అన్నారు.