ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యాంశాలు

సికింద్రాబాద్ కాల్పుల్లో యువకుడి మృతి పట్ల పవన్ కళ్యాణ్ ఆవేదన..

సికింద్రాబాద్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేష్ పట్ల జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేసారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ తన ప్రకటనలో వెల్లడించారు. గాయపడిన వారు త్వరగా కోలుకొనేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.

ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌వేశ‌పెట్టిన అగ్నిప‌థ్ స్కీమ్‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా యువ‌త ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. గత నాల్గు రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్మీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేస్తూ తమ నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ లో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రికతకు దారితీసింది. పలు రైళ్లకు నిప్పు పెట్టడం , స్టేషన్ ను ధ్వసం చేయడం తో పోలీసులు లాఠీచార్జి చేసారు. ఈ క్రమంలో పోలీసులపై విద్యార్థులు రాళ్ల దాడి చేయడం తో , పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన పట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు.

ఇవాళ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరం అని పేర్కొన్నారు. అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్ మెంట్ ప్రక్రియపై చేపట్టిన నిరసనల నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని తెలిపారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ తన ప్రకటనలో వెల్లడించారు. గాయపడిన వారు త్వరగా కోలుకొనేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.