జాతీయం ముఖ్యాంశాలు

కాళ్లు కడిగి తల్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెడ్ మోడీ శత వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా తన తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. గుజరాత్​ గాంధీనగర్​లోని తన నివాసానికి వెళ్లిన మోదీ.. తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి కాళ్లను కడిగిన మోదీ ఆ నీళ్లను కళ్లకు అద్దుకున్నారు. అనంతరం తల్లికి మిఠాయిలు తినిపించిన ప్రధాని మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. హీరాబెన్ మోదీ 100 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె తన చిన్న కొడుకు పంకజ్ (పీఎం మోడీ సోదరుడు)తో కలిసి గాంధీనగర్‌లో నివసిస్తోంది. 100 ఏళ్ల వయస్సులో కూడా హీరాబెన్‌కు ఎలాంటి వ్యాధి లేదు. ఆమె సాధారణ ఆహారాన్ని ఇష్టపడుతుంటారు. అదే ఆమె ఆరోగ్య రహస్యం కావచ్చు.

100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా.. తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు ట్వీట్​ చేశారు మోదీ. తన తల్లికి అంకితం చేస్తూ.. ఓ బ్లాగ్​ రాశారు. అమ్మ గొప్పతనం గురించి వివరిస్తూ.. అమ్మ అంటే ఒక్క పదం కాదని.. ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని అందులో వివరించారు. హీరాబెడ్ మోడీ 1923 జూన్‌ 18న జన్మించారు. ఇవాళ్టితో ఆమె 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని శత వసంతంలోకి అడుగుపెట్టారు. మోదీ తల్లి ప్రత్యేకమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు.తాను తినే ఆహారాన్ని తానే వండుకోవడానికి ఇష్టపడుతుంటారని సమాచారం. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం ఆమెకు ఇష్టం ఉండదు.

ఆమె రోజువారీ ఆహారంలో పప్పు, అన్నం, కిచడీచ చపాతీ ఉంటాయి. చక్కెర మిఠాయి తినడానికి ఆమె ఇష్టపడతారని చెబుతుంటారు.కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా మంది ప్రజలు భయపడినపుడు,మోదీ తల్లి వ్యాక్సిన్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు. ఈ వయస్సులో, ఆమె వ్యాక్సిన్ పొందడం ద్వారా ప్రజల మనస్సులోని భ్రమలను తొలగించడానికి ప్రయత్నించారు.