జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 12,781 కరోనా కేసులు

యాక్టివ్​ కేసులు.. 76,700

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 12,781 మంది వైరస్​ బారినపడగా.. మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,537 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.17 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది.

భారత్​లో ఆదివారం 2,80,136 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,18,66,707 కోట్లకు చేరింది. మరో 2,96,050 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. ఒక్కరోజే 259,150 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 563 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 543,984,866కు చేరింది. మరణాల సంఖ్య 6,340,676కు చేరింది. ఒక్కరోజే 350,620 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 519,482,011గా ఉంది.