సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే అలాగే ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ..తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసలు కురిపించారు. బసవతారకం క్యాన్సర్ 22వ వార్షికోత్సవ వేడుకలకు హరీషరావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ..హరీష్ రావు… ప్రజల మనిషి అని ఆయన కొనియాడారు. ఆదర్శమైన నాయకుడు హరీష్ రావు అని, హాస్పిటల్ లోకి వచ్చిన వెంటనే.. మనో వ్యాధి తగ్గుతుందని, ఒక్కసారి వెళ్లి కలిస్తేనే.. ఆరు కోట్ల రూపాయిలను మాఫీ చేశారు బాలకృష్ణ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ కింద పేషెంట్ లను ట్రీట్ చేస్తున్న హాస్పిటల్స్ లలో సెకండ్ ప్లేస్ ఉన్నామని, ఎంతోమంది దాతలు హాస్పిటల్ కు సాయం చేస్తున్నారన ఆయన వెల్లడించారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అభిమానం అని పేర్కొన్నారు. ఈ దారిలో కేసీఆర్ వెళ్తున్నప్పుడు క్యాన్సర్ ఆస్పత్రి, ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలు గుర్తుకు చేసుకునే వారని తెలిపారు. నైట్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పగానే బాలకృష్ణ అమలు చేశారు. బాలకృష్ణ అడగగానే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కింద రూ. 6 కోట్ల భారం పడకుండా సీఎం కేసీఆర్ చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పని ఇది అని గుర్తు చేశారు. క్యాన్సర్ రోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 753 కోట్లు ఖర్చు చేసిందని హరీశ్‌రావు తెలిపారు. ఇందులో అత్యధికంగా బసవతారకం ఆస్పత్రికి వెళ్లిందన్నారు. ఈ 22 ఏండ్లలో 3 లక్షల రోగులకు ఈ ఆస్పత్రి సేవలందించడం గొప్ప విషయమన్నారు.