తెలంగాణ

లావణ్యపై పిర్యాదు చేసాం..అధారాలు ఇస్తాంమధు శర్మ, రాజ్ తరుణ్ తరఫు అడ్వకేట్

హైదరాబాద్: నార్సింగ్ పోలీస్స్టేషన్లో లావణ్య పై ఫిర్యాదు చేశాము. పూర్తి ఆధారాలు ముడు రోజులో పోలీసులకు సమర్పిస్తామని నటుడు రాజ్ తరుణ్ తరపు అడ్వకేట్ మధు శర్మ అన్నారు. లావణ్య ఆడపిల్లలకు డ్రగ్ అలవాటు చేస్తుంది. లావణ్య డిమాండ్లకు ఒప్పుకోకపోతే నానా రకాలుగా సాధిస్తుంది. న్యూడ్ వీడియోస్ పెట్టి టార్చర్ చేసింది. ప్రీతి ఉదయ్ లకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.  ప్రీతి ఉదయలు నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు లావణ్య పై. రాజ్ తరుణ్ డ్రగ్స్ ఎంకరేజ్ చేయకపోవడం వల్లే రాజ్ తరుణ్ పై లావణ్య కక్ష పెంచుకుంది. రాజ్ తరుణ్ ను ఇబ్బంది పెట్టాలన్న ఇంటెన్షన్ తో లావణ్య ఇదంతా చేస్తుంది. చాలామందిని లావణ్య డ్రగ్స్ విషయంలో ఇబ్బందులు పెడుతుంది. డ్రగ్స్ విషయంలో లావణ్య కొంతమందిని భయపెట్టి డబ్బులు లాగలని చేసింది. వినీత్ రెడ్డి అలియాస్ చింటూ తో లావన్య కు సంబంధాలు ఉన్నాయి. కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చింది లావణ్య. రాజ్ తరుణ్ కి ప్రాణహాని ఉంది. లావణ్య తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ కేసులో న్యాయ పరంగా ఎంత దూరమైనా వెళ్తాము. మరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ లా రాజ్ తరుణ్ జీవిత మారకుండా కాపాడుకోవాలి. లావణ్య ప్రీతికి సంబంధించిన వీడియోస్ రిలీజ్ చేసిన అంశంపై కూడా నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు.