యాక్టివ్ కేసులు.. 94,420
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 17,073 మంది వైరస్ బారినపడగా.. మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 15,208 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.57 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.22 శాతం వద్ద ఉంది. భారత్లో ఆదివారం 2,49,646 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,11,91,329 కోట్లకు చేరింది. మరో 3,03,604 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 290,919 మంది వైరస్ బారినపడ్డారు. మరో 515 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,350,835కు చేరింది. ఒక్కరోజే 346,304 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 523,861,606గా ఉంది.