అంతర్జాతీయం ముఖ్యాంశాలు

ఇజ్రాయిల్‌ కొత్త ప్ర‌ధానిగా యార్ లాపిడ్‌ బాధ్య‌త‌లు

యార్ లాపిడ్ ఇజ్రాయిల్ కొత్త ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇజ్రాయిల్‌కు ఆయ‌న 14వ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. ప్ర‌ధాని న‌ఫ్తాలీ బెన్నెట్ ఏడాది కాలం త‌ర్వాత ప‌ద‌విని త్య‌జించారు. న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన జ‌ర‌గ‌నున్న జాతీయ ఎన్నిక‌ల వ‌ర‌కు లాపిడ్ దేశ ప్ర‌ధానిగా ఉంటారు. గ‌త నాలుగేళ్ల‌లో ఇజ్రాయిల్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఇది అయిదోసారి అవుతుంది. అయితే రాబోయే ఎన్నిక‌ల్లో మాజీ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెతాన్యూహు నుంచి లాపిడ్‌కు గ‌ట్టి పోటీ ఉండ‌నున్న‌ది. ప్ర‌ధాని బాధ్య‌త‌ల్ని లాపిడ్‌కు బెన్నెట్ అప్ప‌గించారు. 58 ఏళ్ల లాపిడ్ గ‌తంలో టీవీ న్యూస్ యాంక‌ర్‌గా చేశారు.