సినీ ప్రియులకు శుభవార్త. తెలంగాణలో ఆదివారం నుంచి థియేటర్లు ఓపెన్ కానున్నాయి. ఇకపై థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని అనుమతులిస్తూ ఇటు సినీ ప్రియులకు, అటు థియేటర్ యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో లాక్‌డౌన్‌ని ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ని పూర్తి ఎత్తివేస్తున్నారు. దీంతో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు కూడా ఓపెన్ కానున్నాయి.
లాక్ డౌన్ వల్ల సినిమా హాళ్లు దాదాపు మూసివేసి ఉంటున్న సంగతి తెలిసిందే. కేసులు తగ్గడంతో ఓపెన్ చేసేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో సినీ పరిశ్రమకు ప్లస్ కానుంది. కరోనా వల్ల.. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా.. ఓటీటీలో రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇకపోతే థియేటర్స్ ఓపెన్ అయితే థియేటర్స్ వద్ద సినిమాల జాతరే ఉండబోతుంది. ఎందుకంటే గత ఏప్రిల్ నెల నుంచి రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరిగా థియేటర్స్‌లో వకీల్ సాబ్ విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూతపడడంతో సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ఆ లిస్ట్‌లో నాగచైతన్య-సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’. నాని ‘టక్ జగదీష్’, రానా ‘విరాటపర్వం’, చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్ ‘నారప్ప’. రవితేజ ‘ఖిలాడి’, విష్వక్ సేన్ ‘పాగల్’లతో పాటు చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి.