హైదరాబాద్ శివారులో జరిగిన దిశా ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన వారు పోలీసుల కాల్పుల్లో మరణించారు. ఇలాంటి ఘటనలు మరెక్కడ జరగకూడదని అంత కోరుకున్నారు. కానీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటక కెంగేరీ పోలీస్ స్టేషన్లోని రామసంద్రలో దిశా తరహా ఘటన జరిగింది.
గుర్తు తెలియని మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయి నిర్మానుష్య ప్రదేశంలో ఆదివారం కనిపించింది. మృతురాలి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మహిళపై అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన దగ్గర మృతురాలి దుస్తులు లభ్యం అయ్యాయి. ఈ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం వల్ల ఈ దారుణం బయటపడింది. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.