తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కొత్త కేసుల విషయంలో స్పల్పంగా తగ్గుముఖం కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1362 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. శుక్రవారం రోజు 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పాయారు. నిన్న ఒక్కరోజే 1,813మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ శనివారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,12,196 కు చేరింది. మరణాల సంఖ్య 3556 గా ఉంది. ఇప్పటి వరకు 5,90,072 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 18,568 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,23,0005 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తంగా 1,74,37,785 పరీక్షలు పూర్తి చేశారు.