అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని
ప్రధాని మోడి భీమవరంలో జరుగుతున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. హైదరాబాద్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో బయల్దేరిన ప్రధాని ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ప్రధానికి గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, బీజేపీ నేతలు సీఎం రమేశ్, సుజనా చౌదరి తదితరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం గన్నవరం నుంచి భీమవరంకు మోడీ, హరిచందన్, జగన్ ముగ్గురూ హెలికాప్టర్ లో బయల్దేరారు. వీరు ముగ్గురూ ఒకే హెలికాప్టర్ లో పయనమయ్యారు. మరోవైపు భీమమరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించి, నివాళి అర్పించనున్నారు. అనంతరం భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానిని జగన్ సత్కరించనున్నారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/