జాతీయం ముఖ్యాంశాలు

క్‌నాథ్‌సీఎం ఏకు గ్రాండ్ వెల్క‌మ్‌ చెప్పిన భార్య

క్‌నాథ్‌సీఎం మ‌హారాష్ట్ర సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఏక్‌నాథ్ షిండే తొలిసారి థానేలోని త‌న నివాసానికి వెళ్లారు. దీంతో షిండే భార్య ల‌త గ్రాండ్ గా వెల్క‌మ్ ప‌లికేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకుంది. డ్ర‌మ్స్‌తో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. అయితే ఆయ‌న భార్య ల‌తా ఏక్‌నాథ్ షిండే బ్యాండ్ వాయిస్తూ భర్త‌కు వెల్క‌మ్ చెప్పింది. స్వంత ఇంటికి సీఎం ఏక్‌నాథ్ వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న నివాసం వ‌ద్ద బ్యాండ్‌ను సెట‌ప్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏక్‌నాథ్ స‌తీమ‌ణి ల‌తా కూడా బ్యాండ్ వాయిస్తూ క‌న‌పించారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. థానేలోని ఆనంద్‌న‌గ‌ర్‌లో ఉన్న ఇంటికి ఆయ‌న రాత్రి 9.30 నిమిషాల‌కు వెళ్లారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/