వివేకం సినిమా పై హైకోర్టు సీరియస్ అయింది. నియమ నిబంధనలు లేకుండా సినిమాలు ప్రదర్శిస్తే వ్యక్తుల హక్కుకు హక్కులకు భంగం కలగదా ?? ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్న సినిమా ఎలా ప్రదర్శించ బడుతుందని హై కోర్ట్ ప్రశ్నించింది. నారా లోకేష్ , తెలుగుదేశం పార్టీపై వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి తీవ్ర ఆరోపణలు చేసారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో తీసిన వివేకం సినిమా తెలుగుదేశం స్వప్రయోజనాల కోసం వాడుతుందని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. ఈ పిటిషన్ పై హై కోర్టు విచారించింది. తన స్టేట్మెంట్ ఆధారంగా తీసిన సినిమాలో తన పేరు ఉదహరించిడం పై దస్తగిరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.
కేసు సిబిఐ కోర్టులో విచారణలో ఉండగా సినిమా తెరకెక్కించడంపై దస్తగిరి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసారు. ఐ -టి డి పి ప్రోత్సాహంతోనే ఈ సినిమా అన్ని ఓటీడీ ఫ్లాట్ ఫార్మ్స్ లో ప్రదర్శించబడుతుందని పిటిషనర్ పేర్కోన్నారు. తక్షణమే ఈ సినిమా నీ నిలుపుదల చేయాలని తన పిటీషన్ లో కోరారు. పులివెందుల నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారణంగా ఈ విధమైన సినిమా ప్రదర్శించబడటం తన హక్కులకు భంగం కలిగిస్తుందపి పిటిషనర్ వాదన. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలతో తెలుగుదేశం పార్టీ వెనుక ఉండి ఈ సినిమా ప్రదర్శిస్తుందని దస్తగిరి ఆరోపించారు.
తక్షణమే సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఎలక్షన్ కమిషన్ నుండి వివరణ తీసుకోవాలని ప్రభుత్వా న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. ఒక దశలో దీనిమీద ఉత్తర్వులు ఇస్తామని వ్యాఖ్యానించింది. సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఎలక్షన్ కమిషన్ నుండి వివరణ తీసుకోవటానికి ఒక్కరోజు గడువు ప్రభుత్వ న్యాయవాది కోరారు.తరువాత విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.