తెలంగాణ ముఖ్యాంశాలు

దసరా రోజున సంగారెడ్డి సభలో సంచలన ప్రకటన చేస్తానంటున్న జగ్గారెడ్డి…

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యముగా రేవంత్ రెడ్డి TPCC అయినద్దగ్గరి నుండి జగ్గారెడ్డి వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు రేవంత్ అంటే పడని జగ్గారెడ్డి ఢిల్లీ సమావేశాల అనంతరం రేవంత్ కు దగ్గరయ్యారు. ఇద్దరు కలిసి ఉన్నట్లు బయటకు కనిపిస్తున్న..లోలుపాల మాత్రం ఇద్దరికీ అస్సలు పడడం లేదని అర్ధమవుతుంది. రీసెంట్ గా రాష్ట్రపతి విపక్ష పార్టీల అభ్యర్థి యశ్వత్ హైదరాబాద్ కు రావడం , ఆయన్ను VH కలవడం, దానిపై రేవంత్ పలు వ్యాఖ్యలు చేయడం..రేవంత్ కామెంట్స్ కు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం చూసాం. ఆ తర్వాత కీలక ప్రకటన ప్రకటిస్తానని చెప్పినప్పటికీ జగ్గారెడ్డి దానికి సమయం ఉందని అన్నారు.

తాజాగా ఈరోజు శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో జగ్గారెడ్ది కాంగ్రెస్ పార్టీని వీడడం కలలో కూడా జరగదు, జరగని పని అని తేల్చి చెప్పారు. దసరా రోజున సంగారెడ్డి సభలో సంచలన ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.” నేను టిఆర్ఎస్ లో చేరతానని మీడియాలో వచ్చే అంచనాలు ఎప్పటికి నిజం కావు. నాలుగు నెలల పాటు హైదరాబాదులో ప్రెస్ మీట్ లు నిర్వహించను. నా నియోజకవర్గానికే పరిమితం అవుతాను.” అంటూ జగ్గారెడ్డి వెల్లడించారు. మరి దసరా రోజు ఏ ప్రకటన చేస్తాడు..నిజంగానే చేస్తాడా..లేక మరో రోజుకు వాయిదా వేస్తారా అనేది చూడాలి.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/