గోదావరి నదీ ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ.
తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడుతుండడం తో గోదావరికి వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునగగా..పలు రహదారుల మీదకు భారీగా వరద చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అలర్ట్ చేసారు. అలాగే మంత్రి పువ్వాడకు పలు సూచనలు తెలియజేయడం తో ఆయన భద్రాచలంలోని బస చేసి అటు అధికారులను అప్రమత్తం చేస్తూనే అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫోన్ ద్వారా పరిస్థితులను వివరిస్తున్నారు. మంగళవారం గోదావరి వంతెన, కరకట్ట వద్ద గోదావరి నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. వారితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అల్పాహారం, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.. ప్రస్తుతం నీటి మట్టం తగ్గుముఖం పడుతున్నప్పటికి అధికారులు తేలికగా తీసుకోవద్దని, అధికార యంత్రాంగం నిత్య అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతానికి ప్రమాదం లేనప్పటికీ అధికార యంత్రాంగం మరో 24గంటలు అలెర్ట్ గా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, ఆహారం, త్రాగునీరు, మెడిసిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతూ.. బ్లీచింగ్ శానిటేషన్ చేయలని ఆదేశించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/