జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్తగా 20,139 కరోనా కేసులు

యాక్టివ్​ కరోనా కేసులు.. 1,36,076

దేశంలో కరోనా కేసులు రోజువారీ కేసులు భారీ నమోదవుతున్నాయి. 145 రోజుల తర్వాత కేసులు 20వేల మార్కును దాటాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 20,139మంది వైరస్​ బారినపడగా.. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 16,482 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.49 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.31 శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు మాత్రం 5.1 శాతంగా ఉంది. భారత్​లో బుధవారం 13,44,714 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,27,27,559కి చేరింది. మరో 3,94,774 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/