మాల్దీవుల నుంచి సింగపూర్ కు రాజపక్స కొలంబో వీధుల్లో ఆర్మీ పహారా శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో సింగపూర్ వెళ్లి.. అనంతరం సౌదీ అరేబియా వెళ్తునట్లు మాల్దీవులు అధికారులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం శ్రీలంక అధ్యకుడు గొటబాయ రాజపక్స.. కొలంబో నుంచి మాల్దీవులకు పారిపోయారు. అధ్యక్షుడు గొటబాయ, ఆయన సతీమణి, వారి వెంట ఇద్దరు భద్రతా సిబ్బంది సైనిక విమానంలో మాల్దీవులకు వెళ్లినట్లు శ్రీలంక వైమానిక దళం బుధవారం ఓ సంక్షిప్త ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ అభ్యర్థన, అధ్యక్షుడిగా గొటబాయకున్న అధికారాలు, రక్షణ మంత్రిత్వశాఖ అనుమతి మేరకే కటునాయకె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం వేకువజామున 3 గంటలకు వారిని మాల్దీవులకు తరలించినట్లు వివరించింది. తాజాగా గొటబాయ మాల్దీవుల నుంచి సౌదీ అరేబియా వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో లంక ఆర్మీ కొలంబో వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తోంది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/