అధికారిక భవనాలను వదిలి వెళ్లిపోతున్నాంః శ్రీలంక నిరసనకారులు. శ్రీలంకలో అధ్యక్ష, ప్రధాని కార్యాలయాలను ఆందోళనకారులు చుట్టుముట్టిన విషయం తెలిసిందే. నిరసనకారుల ముట్టడి నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం లంకలోని అధ్యక్ష, ప్రధాని భవనాలు ఆందోళనకారుల ఆధీనంలోనే ఉన్నాయి. అయితే ఆ భవనాల నుంచి వెళ్లనున్నట్లు నిరసనకారులు తెలిపారు. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, ప్రెసిడెన్షియల్ సెక్రటేరియేట్, ప్రధాని ఆఫీసు నుంచి శాంతియుతంగా తక్షణమే ఉపసంహరించుకుంటున్నామని ఆందోళనకారులు ఇవాళ ప్రకటించారు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం తమ పోరాటం ఆగదని ఓ ప్రతినిధి చెప్పారు.
శ్రీలంకకు వెళ్లవద్దు అంటూ కొన్ని దేశాలు తమ పౌరులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. బ్రిటన్, సింగపూర్, బహ్రెయిన్ దేశాలు ఇప్పటికే తమ పౌరులకు ఆ ఆదేశాలు ఇచ్చాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇక మాల్దీవులకు పరారీ అయిన లంక అధ్యక్షుడు ఇవాళ సింగపూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/