అంతర్జాతీయం ముఖ్యాంశాలు

మెక్సికోలో కూలిన హెలికాప్టర్‌..14 మంది మృతి

హెలికాప్టర్ ఎందుకు కూలిందన్న దానిపై దర్యాప్తు

మెక్సికోలో సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈఘటనలో 14 మంది మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని నావికాదళం తెలిపింది. సైన్యానికి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ సినలోవా రాష్ట్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ప్రమాద సమయం హెలికాప్టర్‌లో 15 మంది ఉన్నారని పేర్కొన్నారు.

అయితే, చాపర్ కూలిన ఘటనతో అతడికేమైనా సంబంధం ఉందా? అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. 1985లో యూఎస్ యాంటీ నార్కోటిక్స్ ఏజెంట్‌ను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో రాఫెల్ దోషి అని నేవీ తెలిపింది. దేశంలోని మాదక ద్రవ్యాల రవాణా కేంద్రాలలో ఒకటైన వాయవ్య రాష్ట్రమైన సినాలోవాలోని చోయిక్స్ మునిసిపాలిటీలో రాఫెల్ పట్టుబడ్డాడని పేర్కొంది.

1980లలో లాటిన్ అమెరికాలో అత్యంత శక్తిమంతమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా సంస్థలలో ఒకటైన గ్వాడలజారా కార్టెల్ వ్యవస్థాపకుల్లో రాఫెల్ ఒకడు. మెక్సికన్ నేవీ అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిన వెంటనే అమెరికా స్పందించింది. అతడిని పట్టుకున్న అధికారులను ప్రశంసించింది. ఇది చాలా పెద్ద ఘనత అని, ఆలస్యం చేయకుండా అతనిని తమకు అప్పగించాలని కోరింది.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/