బీసీ ల బెర్త్ లెక్కడ? వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై అధికార, ప్రతిపక్షాలలో చర్చ.
పార్లమెంట్ కు రెండు సీట్లు గ్యారంటీ
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు రెండు సీట్లు గ్యారంటీగా ఇవ్వాలని ఆ సామాజిక వర్గం లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ గత ఎన్నికల్లో అదే ఫార్మాలను ఉపయోగించి అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ సాధించింది. అదే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు రెండు సీట్లు ఇచ్చి.. ఎంపీ సీట్లను బీసీలకు కేటాయించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఫార్మాలా కొనసాగుతుందా.. లేదా..? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. లాస్ట్ టైం ఎన్ని కలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పలు నియోజకవర్గాల్లో బీజేపీ సైతం బలపడడంతో ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని రూలింగ్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ సైతం జనాదరణ కలిగిన లీడర్లకే టికెట్ ఇవ్వాలని సర్వేలు చేయిస్తోంది. ఇరు పార్టీలకు సర్వేలే కీలకంగా మారడంతో అభ్యర్థుల మార్పు కచ్చితంగా ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీలకు కేటాయించేసీట్లపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ పార్టీలు 2018 ఎన్నికల ఫార్ములానే కంటిన్యూ చేస్తాయా? లేదంటే సర్వేల ఆధారంగా క్యాండి డేట్లను మార్చాల్సి వస్తే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయన్న విషయంపై చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ క్యాండిడేట్లను డిసైడ్ చేయడంలో పూర్తిగా సర్వేలపైనే ఆధారపడుతున్నారు. ప్రతి పక్ష కాంగ్రెస్ లో మాత్రం ఉదయపూర్ డిక్లరేషన్ కచ్చితంగా అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా టైం ఉన్నప్పటికీ టికెట్ ఆశిస్తున్న పలువురు బీసీ లీడర్లు ఇప్పటినుంచే హైకమాండ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నియోజక కవర్గంలో తమ బలాన్ని చాటుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే బీసీ లీడర్లు గట్టి పోటీ ఇస్తారనుకుంటున్న నియోజకవర్గాల్లో కత్తి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం జాగ్రత్త పడుతున్నారు. తమ ఓటు బ్యాంకుకు గండిపడకుండా కులాలతో కుస్తీ పడుతున్నారు.
క్యాండిడేట్లు మారితే.. కొత్త ముఖాలకు చాన్స్
సర్వేల ప్రకారం క్యాండిడేట్లను మార్చాల్సి వస్తే ఆ ప్రభావం టీఆర్ఎస్ లో కోదాడ, నాగార్జున భారీ సాగర్ నియోజకవర్గాల పైన పడుతుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బీసీ లీడర్లు ఈ నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గంలో మార్పు చేయాల్సి వస్తే అప్పుడు బీసీలకు మరొక నియోజకవర్గాన్ని వెతకాల్సి ఉంటుంది. అదే నిజమైతే ఇప్పుడున్న అంచనాల ప్రకారం టీఆర్ఎస్ కు మునుగోడులో వేకెన్సీ ఉంది. ఇక్కడ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, కేటీఆర్ సన్నిహితుడు కర్నాటి విద్యాసాగర్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇలా చేయడం ద్వారా రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బీసీలకు సముచిత స్థానం కల్పించినట్లు ఉంటుందని. హైకమాండ్ ఆలోచన చేస్తోంది. ఇక కాంగ్రెస్ లోనూ ఇలాంటి మార్పులే కొంచెం అటు ఇటుగా జరిగే చాన్స్ ఉంది. మిర్యాలగూడ స్థానానికి కాంగ్రెస్ లో తీవ్ర పోటీ ఉంది. ఓ వైపు జానారెడ్డి కొడుకులు, మరోవైపు బత్తుల లక్ష్మారెడ్డి వంటి సీనియర్లు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడను ఓసీలకు ఇవ్వాల్సి వస్తే అప్పుడు కాంగ్రెస్ కు కూడా మునుగోడే ఆప్షన్ అవుతుంది. ఎప్పటి లాగే ఆలేరును బీసీలకు ఇస్తే.. రెండో సీటు మునుగోడు తప్ప ఆ పార్టీకి మరొకటి కనిపించడంలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా కాంగ్రెస్ నుంచే ఎంపీగా పోటీ చేస్తే గానీ ఇక్కడ బీసీలకు చాన్స్ లేదు. అదే. జరిగితే ఆ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్ నేత పేరు ప్రచారంలో ఉంది. మునుగోడు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం, కైలాష్ నేత కు అనుకూలంగా ఉంది.
ఆలేరులో కులాలతో కుస్తీ
సామాజిక సమీకరణాలు బలంగా పనిచేస్తున్న పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ లు జాగ్రత్త పడుతున్నారు. ఆలేరులో త్రిముఖపోటీకి అవకాశం ఉండడంతో ఇక్కడ బీసీల ఓట్లు చీలిపోకుండా కాపాడుకునేందుకు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే గౌడ కులస్తులతో మీటింగ్ పెట్టడమే కాకుండా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆలేరులో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. త్వరలో మరో కుల సంఘంతో మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు హాజరుకానున్నట్లు సమాచారం. ఇక్కడ గౌడ, కుర్మ కులస్తులు బలంగా ఉండడం, ప్రత్యర్థులు సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ముందస్తు వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ఫైనల్గా మంత్రి కేటీఆర్ను ఆహ్వానించే యువకులు, సోషల్ మీడియా మేనేజ్ మెంట్తో భారీ సమావేశం ప్లాన్ చేశారు. మరో వైపు ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు. శనివారం నుంచి ఎమ్మెల్యే సునీత ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews
Go to Home page : https://telugoodu.net/