అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

కరాచీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ అయినా ఇండిగో విమానం

ఇండిగో విమానం : షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ఎమర్జెన్సీగా కరాచీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది. విమానంలోని ప్రయాణికులందరినీ మరో విమానంలో తరలించేందుకు ఇండిగో ఏర్పాట్లు చేసింది. సాంకేతిక లోపాన్ని ముందే గుర్తించి అప్రమత్తమైన పైలట్​.. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించినట్లు ఎయిర్​లైన్స్​ ఓ ప్రకనటలో తెలిపింది.

‘షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానం 6E-1406ను కరాచీ వైపు మళ్లించాం. సాంకేతిక సమస్య తలెత్తిందని గుర్తించి పైలట్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. విమానంలోని ప్రయాణికులను కరాచీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మరో విమానాన్ని పంపిస్తాం.’ అని ఇండిగో ప్రకటనలో తెలిపింది.

ఇండియా ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం సడెన్ గా కరాచీలో ల్యాండ్​ అవడం.. 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి. ఢిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న స్పైస్​జెట్​ విమానాన్ని కూడా జులై 5న హడావుడిగా పాక్​లోని కరాచీకి మళ్లించాల్సి వచ్చింది. అప్పుడు ఫ్యూయల్​ ఇండికేటర్​ సరిగా పనిచేయలేదు. ఆ ఎస్​జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్​జెట్​ విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్​ను భారత్​ నుంచి పంపారు. అప్పటివరకు ప్రయాణికులు ఎవరూ ఇబ్బంది పడకుండా వారికి అవసరమైన ఏర్పాట్లు చేశారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/