జాతీయం తెలంగాణ ముఖ్యాంశాలు

మోడీ GST బాదుడు ఫై నేడు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ నిరసనలు

ప్రజల ఫై మోడీ సర్కార్ మరోసారి ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే పలు వాటిపై GST పేరుతో భారం మోపుతున్న కేంద్ర సర్కార్..ఇప్పుడు నిత్యావసరాలను కూడా వదల్లేదు. ప్రతీ కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలు , ఉప్పు , పప్పు, కూరగాయలు ఇలా ఏది వదలకుండా అన్నింటిపై GST భారం మోపుతోంది. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడి జేబును కేంద్రం ఇలా దర్జాగా పన్నుల పేరుతో దోచేస్తుండటంతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

ఇప్పటికే చింతపండు, చక్కెర, వంటనూనెలు తదితర అన్నింటిపైనా జీఎస్టీ విధించి సామాన్యుడు బతకలేని దుస్థితిని తీసుకొచ్చారు. ఇప్పుడు పసిపిల్లల నోటికాడి పాలనూ ఉపేక్షించలేదు. పెరుగు, లస్సీ, బటర్‌మిల్‌ వంటి ప్రీప్యాక్డ్‌, ప్రీలేబుల్డ్‌ పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని వేశారు. అంతేగాక డెయిరీ మిలింగ్‌ మిషనరీపై జీఎస్టీని 12% నుంచి 18 శాతానికి పెంచారు. ఈ నిర్ణయాలతో పాలు, పెరుగు, లస్సీ, బటర్‌మిల్‌ వంటివాటి కోసం ప్రతి కుటుంబం కనీసం 10-15% అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటికే పశువుల మేత దగ్గర్నుంచి అన్నిరకాల వస్తువుల ధరలు పెరిగాయి. తాజా వడ్డింపుతో దేశవ్యాప్తంగా పాల వ్యాపారంపై ఆధారపడిన 9 కోట్ల కుటుంబాలు ప్రభావితమయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం GST పన్ను విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆందోళనలు చేపట్టాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు మరియు పాల ఉత్పత్తుల పైన పన్ను విధించడం వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ.. అన్ని జిల్లాల్లో నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఇందులో రైతులను ముఖ్యంగా పాడి రైతులను భాగస్వాములుగా చేయాలన్నారు.

Follow Us on Facebook : https://www.facebook.com/telugooduNews

Go to Home page : https://telugoodu.net/